NTV Telugu Site icon

Heart-Attack : డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

Heart Atteck

Heart Atteck

సడన్ గా గుండెపోటుకు గురై.. కుప్పకూలిపోయి.. మరణిస్తున్న వారి సంఖ్య ఇటివలే కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అప్పటి వరకు బాగున్న వ్యక్తులు జిమ్ చేస్తూనో.. సినమా చూస్తునో.. వాకింగ్ చేస్తునో.. డ్యాన్స్ చేస్తునో ఒక్కసారిగా కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమైనాప్పటికీ ఈ ఘటనలో తీవ్రభయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు.

Also Read : Child Care Leave: మహిళా ఉద్యోగులకు జగన్ కానుక.. చైల్డ్‌ కేర్‌ లీవ్‌ వాడుకునే ఛాన్స్

ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది. అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్, తపాలా శాకలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్ లో సురేంద్ర కుమార్ దీక్షిత్ డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రిక తరలించగా.. అతనికి గుండెపోటు సడన్ గా రావడంతో చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్ ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.

Also Read : Medaram Crime: దారుణం.. మేడారంలో పూజారి దారుణ హత్య.. బండరాళ్లతో తలపై..

దీంతో ఆయనతో పాటు అప్పటి వరకు డ్యాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ తో పాటు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టర్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చ్ 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చ్ 17న జరిగింది. దాని కంటే ముందు రోజు మార్చ్ 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తునే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు.

Also Read : Gun Fire : టెక్సాస్ హైస్కూల్ లో గన్ ఫైర్.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

కాగా, జనవరిలో మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఓ 16యేళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన వెలుగు చూసింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా త్రిపాఠి అనే ఓ విద్యార్థిని చల్లని వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. దీంతో అదుపుతప్పి కిందపడింది. అలా కుప్పకూలిపోయిన ఆమె ఆ తరువాత మృతి చెందింది. రిపబ్లిక్ డే ఈవెంట్స్ లో భాగంగా రిహార్సల్స్ కోసం వెళ్లిన వ్రిందా.. పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. దీంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ విద్యార్థిని ఆస్పత్రికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు తెలిపారు.

Show comments