Medaram Crime: మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఆయన ములుగు జిల్లాలో కొండాయి గ్రామానికి చెందిన రవి గోవింద రాజుల ఆలయ పూజారిగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఏండ్లుగా పూజారిగా కొనసాగుతున్న ఆయన్ను ఆయన్ను బండరాళ్లతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. పూజారి హత్యతో ఒక్కసారిగా కొండాయి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ఒక పూజారిని సైతం ఆగంతకు ఇంత కిరాతకంగా హత్య చేస్తారా? అని భయభ్రాంతుతలకు లోనయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం ఆదివారం జరిగినట్టుగా స్థానికులు తెలిపారు. అయితే.. నిన్న జరగ్గా ఇవాల ఉదయం వెలుగులోకి వచ్చింది.
Read also: Gun Fire : టెక్సాస్ హైస్కూల్ లో గన్ ఫైర్.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
ఆలయ పూజారి రవిపై ఇంత కిరాతకంగా ఎవరు హత్య చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. గుడిలో పూజారిగా వుంటూ అందరితో సఖ్యతగానే ఉండేవాడని, ఎవరితోనే విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. గుడిలో దొంగతనం చేసేందుకు వచ్చారా? లేక తన ఇంట్లోనే దొంగతనానికి వచ్చిన పూజారి దొంగలు పట్టుకునే ప్రయత్నంలో ఇంత కిరాతకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరీ పూజారిపై బండరాయితో మోది ఇంత కిరాతకంగా హత్య చేసేంత కసి ఎవరికి ఉందని పూజారిపై ఇంతగా కోపం పెంచుకున్న వారు ఎవరైనా గ్రామంలో వున్నారా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూజారి హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఇంతటి కిరాతకానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని, ఎవరిపై అయినా అనుమానాలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని గ్రామస్తులను కోరారు.
Teachers Unions: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లపై సంతకాలు చేస్తే తప్పేంటి?