Site icon NTV Telugu

Betting Apps: బెట్టింగ్ యాప్స్ కేసులపై కీలక నిర్ణయం.. కేసులన్ని సీఐడీకి బదిలీ

Betting Apps 1

Betting Apps 1

బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

READ MORE: Congress : తెలంగాణలో పీసీసీ అబ్జర్వర్ల నియామకం.. 70 మంది నేతలకు బాధ్యతలు

ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్‌ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌లో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. స్పెషల్‌ ఎపిసోడ్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ కనిపించారు.

READ MORE: Congress : తెలంగాణలో పీసీసీ అబ్జర్వర్ల నియామకం.. 70 మంది నేతలకు బాధ్యతలు

Exit mobile version