టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉద్యోగస్తులకు, పెన్షన్లర్లకు ప్రభుత్వం చేసిన మంచి విషయాలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొంతమంది ఓట్ల కోసం మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికారు. కోవిడ్ వల్ల ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల విషయంలో జాప్యం జరిగింది.. దీనిని భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు. పది వేలకు మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వం…