NTV Telugu Site icon

BRS Joinings: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన గోప్లపూర్‌ కాంగ్రెస్ నేతలు

Brs Party

Brs Party

Jadcherla : బీఆర్‌ఎస్‌లోకి వలసపర్వం కొనసాగుతోంది. సంక్షేమ ప్రభుత్వానికే మా మద్దతు అంటూ గోప్లపూర్ వాస్తవ్యులు తెలిపారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని గోప్లపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రాల నర్సింహులు, మల్లెపోగు యాదయ్య, శివతో పాటు 30 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read: Bandla Ganesh: కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మాత బండ్ల గణేష్.. ఆయన రియాక్షన్‌ ఇదే..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్టంలోని ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు నాయకులు మద్దతుగా నిలవాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన సందర్భంలో గుర్తింపు ఉంటుందని, కష్టపడి పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేయాలన్నారు.