Bhimaa : ఓటీటీలోకి వచ్చేసిన “భీమా”..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ”భీమా”. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు..భీమా సినిమాతోనే ఎ హర్ష టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.భీమా చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సలార్, కేజీఎఫ్ చిత్రాలతో గుర్తింపు పొందిన రవి బస్రూర్ సంగీతం అందించారు.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీమా సినిమా మార్చి 8వ తేదీన థియేటర్స్‌లో రిలీజ్ అయింది.
ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.పక్కా మాస్ సినిమాగా తెరకెక్కిన భీమా సినిమా థియేటర్ ప్రేక్షకుల్నిఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి ధరకు సొంతం చేసుకుంది. భీమా మూవీ ఈ నెల 25వ తేదీ (ఏప్రిల్ 25) నుంచి స్ట్రీమింగ్ కానుందని డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ గతంలో ప్రకటించింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఎక్స్ వేదికగా వెల్లడించిందిభీమా సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి .
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- Tags
- bhimaa
- Gopichand
- ott streaming
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!