Gopichand 32 : సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న శ్రీను వైట్ల…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ హీరో గోపిచంద్ దాదాపు తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న రామబాణం సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తన కెరీర్‌లో రెండు భారీ హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ కూడా ఈ సారి గోపిచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. దాంతో గోపీచంద్ కొంత గ్యాప్ తీసుకుని రీసెంట్ గా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా సినిమా చేయని శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు చిన్న హీరోల సినిమా ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన రవితేజకు అమర్ అక్బర్ ఆంటోని రూపంలో భారీ డిజాస్టర్ మూవీ ఇచ్చాడు శ్రీను వైట్ల.. ఆ తర్వాత ఇప్పటివరకు శ్రీనువైట్ల మరో సినిమా చేయలేదు.
ఈ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని శ్రీనువైట్ల ఎంతో కసితో ఉన్నాడు. అదే కసితో షూటింగ్‌ను కూడా సూపర్ స్పీడ్‌గా కానిచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది. ఇటలీలోని మిలాన్‌లో అందమైన లొకేషన్‌లలో ఈ సినిమా షూటింగ్‌ను జరిపారు. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను అభిమానులకు షేర్ చేసారు.. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవి గుహన్, గోపి మోహన్ వంటి స్టార్ టెక్నిషియన్‌లు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. కీలక షెడ్యూల్‌తో పాటు ఓ సాంగ్‌ను కూడా షూట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరో గోపిచంద్ సరసన ఏక్ మినీ కథ బ్యూటీ కావ్య థాపర్ నటిస్తుంది..మాములుగా శ్రీనువైట్ల సినిమాలకు విపరీతంగా ఫ్యాన్స్ వుంటారు.అయితే ఇప్పుడు టైమ్ కలిసి రాక సరైన సినిమాలు పడట్లేదు కానీ.. దూకుడు వరకు ఆయన సినిమాలు జనాలకు ఓ రేంజ్ ఎంటర్‌టైనమెంట్ అందించాయి అయితే ఆ మధ్యన ఢీ సీక్వెల్ అంటూ ప్రకటించినా.. అది కార్య రూపం దాల్చలేదు. ఇక ఎట్టకేలకు మ్యాచో స్టార్ గోపీచంద్ ను ఒప్పించి మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కిస్తున్నాడు.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?