Site icon NTV Telugu

Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. కిందపడి నవ్వుకున్న పంత్, కోహ్లీ!

Sarfaraz Khan Catch

Sarfaraz Khan Catch

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్‌ కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50కు ఆరంభమవుతుంది. మొదటి టెస్టులోనే గెలిచి.. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని టీమిండియా చూస్తోంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మంగళవారం టీమిండియా ప్లేయర్స్ ఫీల్డింగ్‌ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌ సాధన చేశారు. ఈ నలుగురు స్లిప్‌లో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ముఖం మీదకు ఓ క్యాచ్ వచ్చింది. అది సులువైన క్యాచే అయినా సర్ఫరాజ్ భిన్నంగా ప్రయత్నించి నేలపాలు చేశాడు. ఇది చూసిన కోహ్లీ, పంత్, జురెల్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. పంత్ అయితే కిందపడి మరీ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 12వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులో ఆడటం అనుమానంగానే ఉంది. ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టుల్లో సర్ఫరాజ్ విఫలమవగా.. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన టెస్టులో జురెల్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఒకవేళ గాయం కారణంగా గిల్ మొదటి టెస్టుకు దూరమయితే మాత్రం ఇద్దరికీ అవకాశం వస్తుంది. భారత తుది జట్టులో ఎవరు ఉంటారో ఇప్పటికైతే స్పష్టత రాలేదు.

Exit mobile version