బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్ కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50కు ఆరంభమవుతుంది. మొదటి టెస్టులోనే గెలిచి.. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని టీమిండియా చూస్తోంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం టీమిండియా ప్లేయర్స్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్…