Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. కిందపడి నవ్వుకున్న పంత్, కోహ్లీ!
- కంగారూ గడ్డపై భారత్
- నవంబర్ 22 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం
- కిందపడి నవ్వుకున్న పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం భారత్ కంగారూ గడ్డపై అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. శుక్రవారం పెర్త్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50కు ఆరంభమవుతుంది. మొదటి టెస్టులోనే గెలిచి.. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని టీమిండియా చూస్తోంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంగళవారం టీమిండియా ప్లేయర్స్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ సాధన చేశారు. ఈ నలుగురు స్లిప్‌లో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ముఖం మీదకు ఓ క్యాచ్ వచ్చింది. అది సులువైన క్యాచే అయినా సర్ఫరాజ్ భిన్నంగా ప్రయత్నించి నేలపాలు చేశాడు. ఇది చూసిన కోహ్లీ, పంత్, జురెల్ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. పంత్ అయితే కిందపడి మరీ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
Also Read: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 12వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులో ఆడటం అనుమానంగానే ఉంది. ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టుల్లో సర్ఫరాజ్ విఫలమవగా.. ఆస్ట్రేలియా-ఏతో జరిగిన టెస్టులో జురెల్ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఒకవేళ గాయం కారణంగా గిల్ మొదటి టెస్టుకు దూరమయితే మాత్రం ఇద్దరికీ అవకాశం వస్తుంది. భారత తుది జట్టులో ఎవరు ఉంటారో ఇప్పటికైతే స్పష్టత రాలేదు.
The way Sarfaraz Khan took the catch, Virat Kohli, Rishabh Pant & Dhruv Jurel all were laughing.😀
– A lovely video during today’s practice session at Perth..!!! ❤️ pic.twitter.com/GOseztJAqu
— Tanuj Singh (@ImTanujSingh) November 19, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు