Chilkur Balaji Temple: చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతరాలైన శని, ఆదివారలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ విషయంపై ప్రధాన అర్చకులు రంగరాజన్ కాస్త గూగుల్ పై ఘాటుగానే స్పందించడం జరిగింది. అసలు గూగుల్ ను ఎవరు అడిగారని., ఇలా ఎందుకు చూపిస్తుంది అంటూ కాస్త సెటైర్ వేసినట్లుగా మాట్లాడారు.
Prajavani: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం.. రాష్ట్ర ప్రణాళిక సంఘం..
శని, ఆదివారాలలో అసలు గుడి ఎందుకు మూసివేస్తారని అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడుతూ.. అలాంటి తప్పుడు సమాచారాన్ని భక్తులు నమ్మవద్దని., ఎలాంటి అంతరాయం లేకుండా గుడి తెరిచి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాకుండా అక్కడ ఉన్న భక్తులను గూగుల్ కు మెసేజ్ చేయాలని కోరారు. మీరు తప్పుడు సమాచారం అందిస్తున్నారని గూగుల్ కు మెసేజ్ చేయాలంటూ ఆయన ఈ సందర్భంగా భక్తులను కోరారు. దానికి అక్కడ ఉన్న వారందరూ సరే అని సమాధానం ఇచ్చారు. మొత్తానికి చిలుకూరు బాలాజీ ఆలయం మూసి వేయబడదని ఆలయ అర్చకులు కరాకండిగా తెలిపారు.
Kangana Ranaut: కంగనాని చెంపదెబ్బ కొట్టిన కానిస్టేబుల్‌కి మద్దతుగా రైతుల సంఘాల నిరసన..