Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజగా అమ్రోహా సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే దీని కారణంగా ఢిల్లీ-లక్నో రైలు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. అమ్రోహా రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పరిస్థితిని సాధారణీకరించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. గూడ్స్ రైలు మొరాదాబాద్ నుండి ఘజియాబాద్ వైపు వెళుతుంది. అదే సమయంలో అమ్రోహాలోని కళ్యాణ్‌పురా గేట్ 27C గుండా వెళుతోంది. ఇంతలో ఒక్కసారిగా గూడ్స్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్ కూడా ఘటనా స్థలానికి బయలుదేరింది. ప్రమాద స్థలం వద్ద స్థానికులు కూడా గుమిగూడారు. ప్రమాదం కారణంగా ఢిల్లీ నుంచి లక్నో వరకు భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఈ ట్రాక్‌పై వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది.
Read Also:Top Headlines @9AM : టాప్ న్యూస్
#WATCH | Uttar Pradesh: Around 7 coaches of a goods train derailed in Amroha yard between Ghaziabad-Moradabad section, disrupting traffic. The alternative route between Moradabad-Saharanpur-Meerut Ghaziabad is open for the movement of trains
More details awaited pic.twitter.com/kCnC4zf1Ky
— ANI (@ANI) July 20, 2024
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ్స్ రైలు కళ్యాణ్‌పుర రైల్వే గేట్ సమీపంలో వెళుతుండగా, గూడ్స్ రైలులోని పలు కోచ్‌లు ఒక్కసారిగా బోల్తా పడ్డాయి. గూడ్స్ రైలు బండిలు కిందపడటంతో పెద్ద శబ్ధం రావడంతో సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఆరా తీయగా గూడ్స్ రైలు కిందపడి ఉండడం గమనించారు. వెంటనే ఘటనాస్థలికి పలువురు గుమిగూడారు. అయితే వెంటనే రైల్వే అధికారులు, ఉద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం తర్వాత ఢిల్లీ-లక్నో రైలు మార్గం పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే కార్యాలయాల్లో కలకలం రేగింది. ఇంత పెద్ద ఘటన జరిగినా రైల్వే శాఖ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం, పరిస్థితిని సాధారణీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ లక్నో మార్గంలో నడిచే అన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
Read Also:Andhra Pradesh: శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్న కనకదుర్గ, భ్రమరాంబికాదేవి