Site icon NTV Telugu

TS Govt: వీఆర్‌ఏలకు గుడ్‌న్యూస్‌.. 14,954 సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసిన సర్కార్‌

Vras

Vras

తెలంగాణ రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం సీఎం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ శాఖ‌లో 2 వేల 451 జూనియ‌ర్ అసిస్టెంట్, పుర‌పాల‌క శాఖ‌లో 1, 266 వార్డు ఆఫీస‌ర్ పోస్టులు, రెవెన్యూ శాఖ‌లో 679 స‌బార్డినేట్ పోస్టులు, నీటిపారుద‌ల శాఖ‌లో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిష‌న్ భ‌గీర‌థ శాఖ‌లో 3వేల 372 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2వేల 113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల‌ను ప్రభుత్వం కొత్తగా సృష్టించింది.

Read Also: Cat Missing: మంచిర్యాలలో తప్పిపోయిన పిల్లి.. ఆచూకీ చెబితే రివార్డ్ అంటూ పోస్టర్లు

అయితే, విద్యార్హతలు, ఖాళీల ఆధారంగా వివిధ శాఖల్లోకి 20, 555 మంది వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే బాధ్యతను కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. విద్యార్హతల మేరకు ఆఫీస్‌ సబార్డినేట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ను వర్తింప జేసింది. అయితే, వీరిలో 61 ఏళ్లు దాటిన 3,797 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. వయసు నిర్ధారణకు ఈ ఏడాది జూలై 1ని కటాఫ్‌ తేదీగా నిర్ధారించింది. అప్పటికి 61 ఏండ్లలోపు వయసున్న వారికి నేరుగా పోస్టింగ్‌ ఇవ్వనున్నాట్లు తెలిపింది.

Read Also: PM Modi: 508 రైల్వేస్టేషన్ల ఆధునికరణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన

Exit mobile version