NTV Telugu Site icon

Telangana: ఆ రెండు జిల్లాల జొన్న రైతులకు గుడ్న్యూస్.. క్వింటాళ్ల పరిమితి పెంపు

Sorghum Farmers

Sorghum Farmers

రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా ఇప్పటికే క్వింటాలుకు మద్ధతు ధర రూ. 3180 చెల్లించి రైతుల వద్ద నుండి జొన్న కొనుగోలు చేస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాల దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్ల పరిమితిని విధించి కొనుగోలు చేస్తున్న సందర్భములో.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఈ యాసంగిలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఆ మేరకు ఎకరానికి ఇంతకుముందు ఉన్న పరిమితిని పెంచాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.

Read Also: Shabbir Ali: నేను బ్రతికున్నంత వరకు కామారెడ్డి జిల్లాను తీయలేరు..

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జొన్న పండించిన రైతుల విజ్ఞప్తి మేరకు మరియు సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం జొన్న కొనుగోళ్లపై ఆ రెండు జిల్లాలలో ఎకరాకు ఇంతకుముందు ఉన్న 8.85 క్వింటాళ్ల పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ, కొనుగోలు ఏజెన్సీ మార్క్ ఫెడ్ను తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ఆదేశించింది.

Read Also: Yarlagadda Venkat Rao: ప్రచారంలో వేగం పెంచిన యార్లగడ్డ వెంకట్రావు

కావున జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ రేటుకు అమ్ముకోవద్దని.. వారివారి పంట విస్తీర్ణాల నమోదు మేరకు పెంచిన దిగుబడి పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతులవద్ద నుండి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా జొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది.