Site icon NTV Telugu

Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. త్వరలోనే ఆ హామీల అమలు

Revaanth

Revaanth

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆ రెండు హామీల అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు కేస్లాపూర్‌లోని నాగోబా దర్బార్‌లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. అలాగే.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు.

Read Also: Student Suicide: బిట్ కాయిన్ ట్రేడింగ్లో నష్టం.. ఓ విద్యార్థి బలి

గతంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. స్కూల్‌ యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ప్రశ్నించారు.

Read Also: Jharkhand: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన ఝార్ఖండ్ పాలిటిక్స్

ఇక.. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ నాగోబాను దర్శించుకున్నారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version