Budget 2024 : బడ్జెట్లో శుభవార్త.. రూ.8 లక్షల వరకు సాలరీపై నో టాక్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2024 : ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని పన్ను చెల్లింపుదారులు శుభవార్త వినవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం.. కాబట్టి పన్ను చెల్లింపుదారులను తమవైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. అందువల్ల, బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. సమర్పించబోయే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పు ఉండవచ్చు. ఇప్పటికే ఉన్న పన్ను మినహాయింపు పరిధిని కూడా పెంచవచ్చు. దీని కింద రూ. 8 లక్షల వరకు ఆదాయం పన్ను ఉండకపోవచ్చు.
పన్ను చెల్లింపుదారుల కోసం బడ్జెట్ 2024లో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో స్వల్ప మార్పులు చేయవచ్చు. ఇందులో ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపును పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో ప్రస్తుత పన్ను మినహాయింపు రూ.7 లక్షలు. దీన్ని రూ.7.5 లక్షలకు పెంచవచ్చు. అంటే అదనంగా రూ.50 వేలు తగ్గింపు ఇవ్వవచ్చు. గతంలో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఇందులో సెక్షన్ 87(ఏ)లో రాయితీని రూ.12500 నుంచి రూ.25000కు పెంచారు.
Also Read
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
- Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
- Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
Read Also:Republic Day: స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ.. కొద్ది నిమిషాల్లోనే..!
రూ.8 లక్షల వరకు జీతం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందవచ్చు. బడ్జెట్లో ఇలాంటి ఏర్పాటు చేస్తే పన్ను మినహాయింపు పరిమితి రూ.8 లక్షల వరకు ఉంటుందని పన్ను నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఇందులో ప్రాథమిక మినహాయింపు, రాయితీ, ప్రామాణిక తగ్గింపు కూడా ఉన్నాయి.
2023-24 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో మార్పులు చేశారు. ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. అదే సమయంలో రూ.5 లక్షల వరకు లభించే రాయితీ పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. ఇది కాకుండా, స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా దీనికి జోడించబడింది. దీని తర్వాత రూ.7.5 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది.
Read Also:105 Minutes Movie Review: 105 మినిట్స్ మూవీ రివ్యూ
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్