PM Kisan Scheme: పీఎం కిసాన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. చనిపోయినా డబ్బులొస్తాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Kisan Scheme: బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో వచ్చిందే పీఎం కిసాన్ యోజన. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకోవచ్చు. ఏడాదిలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఇప్పటి వరకు రైతులకు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత రానుంది. అయితే ఇప్పటి వరకు ఏ తేదీన రైతు ఖాతాల్లో జమ చేస్తారనే విషయం ఇంకా కేంద్రం అధికారికంగా వెల్లడించకపోయినా.. ఈ వారంలో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు తెలియని అనేక నియమాలు ఉన్నాయి. వాస్తవానికి, రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే దాన్ని పరిష్కరించుకోండి.
Also Read
- కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
Read Also: Dhavaleshwaram project: ధవళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు
ఇందుకు మీరు హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎంకిసాన్‌కు చెందిన హెల్ప్‌లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092లో సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఇ-మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయవచ్చు. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోనట్లయితే, అధికారిక వెబ్సైట్ ని సందర్శించడం ద్వారా సదరు రైతు పేరును నమోదు చేయడం ద్వారా పీఎం కిసాన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.అయితే ఈ పథకం లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణించినా, ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు.లబ్ధిదారుడు మరణిస్తే సాగు భూమిని కలిగి ఉన్న రైతు వారసులు ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు. అయితే దీని కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా రూపొందించబడ్డాయి. ఆ రైతు వారసుడు పీఎం కిసాన్ పోర్టల్‌లో ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలి. అంతే కాదు.. ఈ వారసుడు ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలనే షరతులను నెరవేరుస్తున్నాడా లేదా అనేది కూడా చూస్తారు. రైతు వారసుడు ఈ పథకం కింద రూపొందించిన నిబంధనలను నెరవేర్చినట్లయితే, అతను ఈ పథకం ప్రయోజనం పొందుతాడు.
తాజావార్తలు
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
ట్రెండింగ్
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!