Good News: బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్’ (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ పనులు ముమ్మరం చేసింది. ఈ సదుపాయాన్ని ఈ ఏడాది చివరి నాటికి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also: China Bat Woman: కరోనా లాంటి మరో ప్రాణాంతక మహమ్మారి.. చైనా బ్యాట్ ఉమన్ హెచ్చరిక
Also Read
తొలిదశలో బస్సుల్లో దీన్ని అమలు చేసిన తర్వాత ఆటోలు, ట్యాక్సీలు వంటి ఇతర ప్రజా రవాణా మార్గాల్లో కూడా దీన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బస్సు కండక్టర్‌కు ఇచ్చిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ (ఈటీఎం) నుంచి కార్డును స్వైప్ చేయడం ద్వారా ఛార్జీలు చెల్లించవచ్చు. ఈ కార్డ్ అన్ని మెట్రో స్టేషన్లు, ISBT, ఢిల్లీ టూరిజం కార్పొరేషన్ సమాచార కేంద్రాలలో అందుబాటులో ఉంటుంది. NCMC నుండి ఛార్జీల చెల్లింపు కోసం DTC, క్లస్టర్ బస్సులలో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్లు(ఈటీఎం)లను అమర్చాలని రవాణా శాఖ ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Minister RK Roja: బాలయ్యకు రోజా కౌంటర్.. తొడగొట్టాడు.. తోక ముడిచాడు..!
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రభుత్వ బస్సుల్లో సగటున రోజుకు 40 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇందులో దాదాపు 35 శాతం మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. రోజుకు 25 లక్షల మందికి పైగా డబ్బులు చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ఇప్పుడు బస్సుల్లో కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని వల్ల రాజధానిలో మెట్రో, బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యేక టిక్కెట్లు పొందవలసిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!