Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో విమాన సౌకర్యాలు
- ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన రైల్వేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్‌ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల అనుభవం మరింత అద్భుతంగా ఉండనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
Also Read
ఐఆర్సీటీసీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో 6 నెలల పాటు ఈ ప్రాజెక్ట్‌ను ట్రయల్‌గా అమలు చేసింది. ఇందుకోసం 34 మంది శిక్షణ పొందిన ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లను నియమించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా రైళ్లలో కూడా ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. యాత్రలలో ప్రజల సౌకర్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని అంటున్నారు. ఈ సందర్భంగా.. IRCTC ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఐఆర్‌సిటిసి కృషి చేస్తోందని తెలిపారు.
Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
‘సాధారణంగా లైసెన్స్ పొందిన క్యాటరర్ ప్రయాణీకులకు ఆహారం అందించే వ్యక్తికి ప్రతి నెల రూ. 8,000-10,000 చెల్లిస్తారు. అయితే.. అత్యుత్తమ సేవలను అందించడానికి, IRCTC ఈ ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లకు నెలకు రూ. 25,000 చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలును కేవలం 18 నెలల్లో చెన్నైకి చెందిన రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇందులో అంతర్గత రూపకల్పన మరియు తయారీ, కంప్యూటర్ మోడలింగ్ ఉన్నాయి. ఇది పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ రైలు. దాని కోచ్‌లలో పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టమ్‌తో 30 శాతం వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయగలదు’ అని సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు