Gold Seized: తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 17 లక్షల విలువ చేసే 281 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం దొరికింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా…..బంగారాన్ని కరిగించి లుంగీలకు కోటింగ్ చేసి తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. దుబాయ్ నుంచి ఈ లుంగీలు ఎందుకు తీసుకుని వచ్చాడనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు
24 గంటల సుదీర్ఘ విచారణలో లుంగీలో దాచిన బంగారం గుట్టురట్టు అయినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. తెచ్చిన లుంగీలను పరిశీలించగా.. బంగారం విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన 7 లుంగీలకు బంగారం కోటింగ్ చేసి ఆ ప్రయాణికుడు లగేజ్ బ్యాగ్‌లో దాచాడు. అతడిని ఇంకా ఎన్నిసార్లు ఇలా బంగారాన్ని తరలించాడనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.