Gold and Silver Price on 2023 December 20th in Hyderabad: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. గత రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా.. నేడు దేశ వ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (డిసెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,620గా ఉంది.
గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,950లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,220గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,620గా కొనసాగుతోంది.
Also Read: Russia Ukraine War: 3.83లక్షల మందిని పొట్టన పెట్టుకున్న రష్యా
నేడు బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర కాస్త తగ్గింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 77,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండిపై రూ. 500 తగ్గింది. ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, బెంగళూరు పుణెలో కిలో వెండి ధర రూ. 77,500గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,500 వద్ద కొనసాగుతోంది.