గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరలా పెరుగుతూ కొనుగోలు దారులకు భారీ షాకిస్తున్నాయి. గోల్డ్ రేట్స్ వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.500 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.550 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (నవంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,620గా ఉంది. గత రెండు రోజుల్లో 22 క్యారెట్లపై 600, 700.. 24 క్యారెట్లపై 660, 770 పెరిగింది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. తులం వెండిపై నిన్న రూ.2000 పెరగగా.. నేడు రూ.500 పెరిగింది. బుధవారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఒక వెయ్యిగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92 వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,150
విజయవాడ – రూ.71,150
ఢిల్లీ – రూ.71,300
చెన్నై – రూ.71,150
బెంగళూరు – రూ.71,150
ముంబై – రూ.71,150
కోల్‌కతా – రూ.71,150
కేరళ – రూ.71,150
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.77,620
విజయవాడ – రూ.77,620
ఢిల్లీ – రూ.77,770
చెన్నై – రూ.77,620
బెంగళూరు – రూ.77,620
ముంబై – రూ.77,620
కోల్‌కతా – రూ.77,620
కేరళ – రూ.77,620
Also Read: Rafael Nadal Retirement: పరాజయంతో కెరీర్‌ను ముగించిన ‘స్పెయిన్ బుల్’!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.92,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,01,000