గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. 10 గ్రాముల తులం బంగారంపై రూ.600 తగ్గింది. హయ్యమ్మ.. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మళ్లీ షాక్ ఇచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (అక్టోబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. దాంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,950గా.. 24 క్యారెట్ల ధర రూ.79,580గా ఉంది.
నేడు బంగారం ధరలు పెరగగా.. వెండి ధర మాత్రం భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై ఏకంగా రూ.4000 వేలు తగ్గింది. శుక్రవారం కిలో వెండి రూ.98,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర లక్ష ఏడు వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,950
విజయవాడ – రూ.72,950
ఢిల్లీ – రూ.73,100
చెన్నై – రూ.72,950
బెంగళూరు – రూ.72,950
ముంబై – రూ.72,950
కోల్‌కతా – రూ.72,950
కేరళ – రూ.72,950
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,580
విజయవాడ – రూ.79,580
ఢిల్లీ – రూ.79,730
చెన్నై – రూ.79,580
బెంగళూరు – రూ.79,580
ముంబై – రూ.79,580
కోల్‌కతా – రూ.79,580
కేరళ – రూ.79,580
Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా నాకు ముద్దు పెట్టలేదు: నటుడు
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,07,000
విజయవాడ – రూ.1,07,000
ఢిల్లీ – రూ.98,000
ముంబై – రూ.98,000
చెన్నై – రూ.1,07,000
కోల్‌కతా – రూ.98,000
బెంగళూరు – రూ.98,000
కేరళ – రూ.1,07,000