Todays Gold Rate in Hyderabad on 25 July 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జూన్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950 తగ్గి రూ.64,000గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.1040 పతనమై.. రూ.69,820కి దిగొచ్చింది. ఈ 8 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై దాదాపుగా 5 వేలు తగ్గడం విశేషం. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,950గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.64,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.69,820గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.64,300గా.. 24 క్యారెట్ల ధర రూ.70,150గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.64,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.69,820గా నమోదైంది.
Also Read: Janhvi Kapoor: పక్షవాతానికి గురయ్యానా అనిపించింది.. ఆ మూడు రోజులు చాలా భయంగా గడిచాయి: జాన్వీ
ఈరోజు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఏకంగా రూ.3000 తగ్గింది. నేడు కిలో వెండి రూ.84,500గా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.84,500 కాగా.. ముంబైలో రూ.84,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.89,000లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.84,500గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.89,000లుగా నమోదైంది. కిలో వెండి ధర ఇటీవలి రోజుల్లో లక్ష దాటిన విషయం తెలిసిందే.