పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు స్వల్పంగా ధరలు తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు రూ.110 తగ్గి రూ. 63,270కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,100 ఉండగా ఈరోజు రూ.58,000 వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే దాదాపు రూ. 100 తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు 78,000 ల స్థిరంగా ఉన్నాయి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,940గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,280గాను ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,430గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,430గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి… ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,280గా నమోదైంది.
వెండి ధరల విషయానికొస్తే ఈరోజు మార్కెట్ లో పసిడి ధరల బాటలోనే నడిచాయి.. ఈరోజు స్థిరంగా ఉన్నాయి..హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,600.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..