Site icon NTV Telugu

Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold2

Gold2

పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్న తరుణంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ఆభరణాల ధరలు కూడా పెరగొచ్చని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో మగువలకు గుడ్‌న్యూస్ అందింది. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు.. ఈరోజు కూడా భారీగా తగ్గాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 3,110 తగ్గగా.. కిలో వెండిపై రూ.10,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్

తులం గోల్డ్‌పై రూ.3,110 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,64,510 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,850 తగ్గడంతో రూ.1,50,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,340 తగ్గడంతో రూ.1,23,380 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఎన్నిక.. సవాళ్లను ఎదుర్కోగలరా?

ఈరోజు కూడా సిల్వర్ ధర భారీ ఊరట కలిగించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ.10,000 తగ్గడంతో రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,95,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version