బంగారం ధరలకు బ్రేక్‌లు పడడం లేదు. తగ్గుముఖం పడతాయేమోనని ఎదురుచూసున్న పసిడి ప్రియులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ధరలు దిగొస్తాయని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా పరుగులు పెట్టడం మగువలను నిరాశపరుస్తుంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 660 పెరగగా.. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో సిల్వర్ ధర రెండు లక్షలకు చేరువలో ఉంది.
ఇది కూడా చదవండి: Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.660 పెరిగి రూ.1,30,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 600 పెరిగి రూ.1,19,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 పెరిగి రూ.97,860 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Parliament Winter Session: నేటినుంచి పార్లమెంట్ సెషన్స్.. ఢిల్లీ బ్లాస్ట్, ‘సర్’పై దద్దరిల్లే అవకాశం
ఇక వెండి ధర అయితే హడలెత్తిస్తోంది. 2 లక్షలకు చేరువ దిశగా దూసుకుపోతుంది. కిలో వెండిపై ఈరోజు రూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,88, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,96,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,88, 000 దగ్గర అమ్ముడవుతోంది.