Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ: మంత్రి కందుల దుర్గేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Durgesh: అమరావతిలోని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణతో పాటు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, కుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
బలం, ఆరోగ్యం, విటమిన్లు అన్నీ వీటిలో ఉన్నాయి. ఈ ఫుడ్స్ మిస్ అవ్వకండి!
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ఈ మహోత్సవానికి సుమారు 10 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లను ఆధునీకరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. భక్తుల కోసం తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి గదులు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. భారీగా రానున్న భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Tollywood : మే’లో వరుస రీ రిలీజ్ లు!
పుష్కరాల ఏర్పాట్లపై త్వరలోనే రాజమహేంద్రవరం కేంద్రంగా కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ పనుల వివరాలను మంత్రి దుర్గేష్ సమగ్రంగా వివరించినట్లు తెలిపారు. రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచేలా, ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!