NTV Telugu Site icon

Kohli-Maxwell: ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌ అకౌంట్ బ్లాక్ చేసిన కోహ్లీ..!

Kohli

Kohli

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ మంచి ఫ్రెండ్స్.. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్నారు. అయితే.. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అకౌంట్‌ను బ్లాక్ చేసినట్లు మ్యాక్స్‌వెల్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అందుకు గల కారణమేంటో మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. 2017లో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మాక్స్‌వెల్ కోహ్లీని ఇమిటేట్ చేశాడు. రాంచీ టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ భుజానికి గాయమైంది. ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న మాక్స్‌వెల్ కోహ్లీని ఇమిటేట్ చేశాడు. దీంతో.. అది చూసిన కోహ్లీ మాక్స్‌వెల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశాడు. అయితే.. అతను ఆర్సీబీలో చేరిన తర్వాత కోహ్లీ సమర్థించాడు.

Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల వేట.. 19 మంది మావోల అరెస్ట్

లిస్ట్‌ఎన్‌ఆర్ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ.. తాను ఆర్‌సీబీ జట్టులోకి వస్తున్నానని తెలుసుకుని.. తనకు మెసేజ్ చేసి జట్టులోకి స్వాగతం పలికిన మొదటి వ్యక్తి విరాట్ అని అన్నాడు. ఐపీఎల్‌కు ముందు శిక్షణా శిబిరానికి తాను వచ్చినప్పుడు, ఇద్దరం మాట్లాడుకునే వాళ్లమని చెప్పాడు. అలా మంచి స్నేహితులమయ్యామని మ్యాక్సీ అన్నాడు. విరాట్ పోస్టులు తనకు చూపించేవి కాదని.. ఒకసారి తాను విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లి ‘నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేశావా..? అని అడిగానని మ్యాక్స్ వెల్ చెప్పాడు. అప్పుడు కోహ్లీ.. అవును చేశాను అన్నాడు. దానికి తాను మంచి పని చేశావ్ నిజంగా నేను నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు అని మ్యాక్స్ వెల్ సారీ చెప్పినట్లు చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ.. తనను అన్‌బ్లాక్ చేశాడని, తాము మంచి స్నేహితులమయ్యామని మ్యాక్స్ వెల్ పేర్కొన్నాడు.

Read Also: Tejas MK1A: తేజస్ ఇంజిన్ డెలివరీ ఆలస్యం.. అమెరికన్ కంపెనీకి భారత్ భారీ జరిమానా..

Show comments