Girl Sneeze Challenge: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వాటి వేదికగా చాలా మంది చాలా ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. వారు ఎవరిని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ట్యాగ్ చేసి వారు కూడా అది చేయాలని కోరుతున్నారు. ఐత్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇలా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అందరూ అసాధ్యమనుకొనే ఒక విషయాన్ని ఒక అమ్మాయి తనకు తానే ఛాలెంజ్ చేసుకొని చేసి చూపించింది.
Also Read: Donald Trump: ఎక్స్(ట్విటర్) లోకి ట్రంప్ రీ ఎంట్రీ.. ఏం పోస్ట్ పెట్టారంటే?
తుమ్ము.. ఇది వస్తే ఆపడం చాలా కష్టం. ఎంతమందిలో ఉన్న, ఎక్కడ ఉన్న తుమ్మాల్సిందే. తుమ్మును ఆపుకుంటే చాలా నష్టాలు జరుగుతాయి. కొన్ని సార్లు అది ప్రాణాపాయం కూడా కావచ్చు. ఇక బ్రిటన్ లో ఈ మధ్య తుమ్ము ఆపుకున్న ఓ వ్యక్తికి శ్వాసనాళంలో రంధ్రం పడిన విషయం కూడా తెలిసిందే. ఇక తుమ్ము గురించి చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కళ్లు మూయకుండా తుమ్మలేమని, కళ్లు తెరుచుకొని తుమ్మితే కళ్లు బయటకు వచ్చేస్తాయని అంటూ ఉంటారు. ఇక తుమ్ముతో చాలా సెంటిమెంట్లు కూడా ముడిపడి ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుుడు తుమ్మకూడదని అలా చేస్తే నష్టం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక తుమ్మితే కూర్చొని మంచి నీరు తాగి వెళ్లాలంటారు. అంతేకాకుండా కళ్లు మూసుకోకుండా తుమ్మితే కంటి సమస్యలు వస్తాయని, కంటి నరాలు దెబ్బతింటాయని చాలా మంది చెబుతారు. అయితే దీనిని ఛాలెంజ్ గా తీసుకొని ఒక అమ్మాయి కళ్లు మూయకుండా తుమ్మాలనుకుంది. దాని కోసం ముక్కులో మేకప్ బ్రష్ పెట్టుకొని తుమ్ము వచ్చినప్పుడు కళ్లు మూసుకోకుండా తుమ్మింది. అయితే తుమ్మడం పూర్తి కాగానే ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వేసింది. అయితే కళ్లు మూసుకోకుండా తుమ్మిన ఇప్పటి వరకు అందరూ చెప్పినట్లు ఆమెకు ఏం కాలేదు. ఆమె బాగానే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారు ఇదేం ఛాలెంజ్ తల్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె మేకప్ బ్రష్ పెట్టుకొని తుమ్మడం చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు. చూడాలి మరి దీనిని ఛాలెంజ్ గా తీసుకొని ఎంత మంది ఇలాంటి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో.