Lady Fan Drinking Beer in SA20 Cricket League: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటే.. మరోవైపు స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళా అభిమాని ఒక్క గుటికలోనే గ్లాస్ బీర్ మొత్తం తాగేసింది. అంతేకాదు పక్కన ఉన్న వారి గ్లాస్ కూడా తీసుకుని గుటుక్కుమంది. ఈ ఘటనతో స్టాండ్స్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన వారు ఫన్నీగా స్పందిస్తున్నారు.
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా గత శుక్రవారం (జనవరి 19) కేప్ టౌన్ మైదానంలో ముంబై కేప్‌టౌన్, పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరామెన్ ఫోకస్ ఓ అమ్మాయిపై పడింది. తాను మైదానంలోని టీవీలో కనిపించడం గమనించిన యువతి ఆనందంతో గెంతులేసింది. ఆ ఆనందంలో తన చేతిలో ఉన్న బీర్ గ్లాస్‌ను ఒక్క గుటికలో తాగేసింది. బౌలర్ బంతి వేసాక కెమెరామెన్ మరోసారి ఆ యువతిని చూపించాడు. అప్పటికే తన బీర్ అయిపోవడంతో.. పక్కనే కూర్చొన్న తన అంకుల్ చేతుల్లోని బీర్‌ను తీసుకుని తెగేసింది. దాంతో స్టేడియంలో ఉన్న వారంతా సదరు యువతికి క్లాప్స్ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Rinku Singh: 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్!
ఈ మ్యాచ్‌లో ముంబై కేప్‌టౌన్ 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (46; 31 బంతుల్లో), జేసన్ రాయ్ (38; 14 బంతుల్లో) రాణించారు. కేప్కేప్‌టౌన్ బౌలర్లలో థామస్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం కేప్‌టౌన్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రికెల్టన్ (94 నాటౌట్), డసెన్ (41) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
What a hero!!! 😂 #MICTvPR #SA20 #MICapeTown
🎥 @SkyCricket pic.twitter.com/PvWMpH4vZr
— Danny Culley (@DannyCulley1) January 19, 2024