NTV Telugu Site icon

Viral Video: మెట్రోలో అమ్మాయి స్టంట్ అదుర్స్.. వీడియో వైరల్

Metro

Metro

సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసమని రకరకాల ప్రదేశాలను ఎంచుకుంటున్నారు నెటిజన్లు. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా.. ఎక్కడ హైలెట్ గా నిలుస్తారో అక్కడే స్టంట్స్, వీడియోలు చేస్తూ చూపిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రో సోషల్ మీడియా వీడియోలకు ఫ్లాట్ ఫాంగా మారింది. ఢిల్లీ మెట్రోలో చాలాసార్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే మెట్రోలో ఇలాంటి వీడియోలు చేయడానికి అనుమతి లేదని పలుమార్లు చెప్పినప్పటికీ.. బుద్ధి మారడం లేదు. తాజాగా మరో అమ్మాయి ఢిల్లీ మెట్రోలో చేసిన స్టంట్ వీడియో వైరల్ అవుతుంది. అందరూ చూస్తుండగానే.. ఆ అమ్మాయి స్టంట్స్ చేసింది.

Anasuya Bharadwaj: ఏంట్రా మీరంతా అంటూ పరువు తీసేసిన అనసూయ

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుండి అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో గుర్తింపు కోసం జనాలు.. మెట్రో స్టేషన్లు, రైళ్ల లోపల రీళ్లు వీడియోలు చేస్తున్నారు. ఇంతకుముందు స్టేషన్ ఆవరణలో అసభ్యకరంగా ప్రవర్తించడం, పాటలు పాడటం, రీల్స్ చేయడం వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Fuel Prices: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇంధన ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి ఏం అన్నారంటే?

మెట్రోలో ప్రయాణించేటప్పుడు క్రమశిక్షణ పాటించాలని, ఇతరులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఢిల్లీ మెట్రో ఇటీవల ప్రయాణికులకు తెలిపింది. ప్రయాణికులు వారి ప్రవర్తనతో తోటి ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలని DMRC ప్రకటన పేర్కొంది. మరోవైపు DMRC ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఇలాంటి పనుల దృష్ట్యా.. క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నాయి. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మెట్రో లేదా ఏదైనా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో చేయడం చట్టవిరుద్ధం, కానీ బేబీ బాగా చేసారని ఒక వినియోగదారుడు తెలిపాడు. మరొకరేమో నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని రాశాడు.