Site icon NTV Telugu

Shubman Gill: గిల్ ఇంకా కోలుకోలేదు.. బీసీసీఐ అప్డేట్

Gill

Gill

టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడలేదు. కారణం అతను డెంగ్యూ బారిన పడ్డాడు. ఇక రేపు టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా శుభ్‌మన్ గిల్ ఆడటంలేదని బీసీసీఐ తెలిపింది. ఇవాళ టీమిండియా ఢిల్లీకి బయల్దేరిందని.. అయితే గిల్ జట్టు వెంట వెళ్లబోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గిల్ చెన్నైలోనే వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందనున్నాడని తెలిపారు.

Read Also: Sarvam Shakthi Mayam: ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

భారత్-పాక్ మ్యాచ్ వరకు శుభ్‌మన్ గిల్ ఫిట్‌గా ఉంటాడని భారత జట్టు మేనేజ్‌మెంట్, అభిమానులు ఆశిస్తున్నారు. డెంగ్యూ బారిన పడ్డవారు పూర్తిగా ఫిట్‌గా మారడానికి 4 నుంచి 10 రోజులు పడుతుంది. అయితే అక్టోబర్ 14న జరిగే పాకిస్తాన్తో మ్యాచ్ వరకు తిరిగి జట్టులో చేరాలని అందరు కోరుకుంటున్నారు.

Read Also: Urfi Javed: ఓరి నాయనో.. మరో కొత్త అవతారంలో బ్యూటీ.. నెటిజన్స్ ట్రోల్స్..

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్లు విఫలమైన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాపై భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ షో చూపించారు. ఇషాన్ కిషన్‌తో పాటు రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ డకౌట్లతో పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ల అద్భుత భాగస్వామ్యం టీమిండియాను కష్టాల్లోంచి గట్టెక్కించింది. అయితే ఇప్పుడు ఓపెనర్ గా మంచి భాగస్వామ్యాన్ని అందించడం కోసం.. భారత అభిమానుల కళ్లు శుభ్‌మన్ గిల్ వైపు చూస్తున్నాయి. చూడాలి మరి గిల్ తిరిగి ఎప్పుడు టీంలోకి చేరుతాడో.

Exit mobile version