NTV Telugu Site icon

Gidugu Rudraraju: మణిపూర్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు..

Gidugu

Gidugu

సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కేసుల గురించే వాళ్ళు బీజేపీకి ఎదురు చెప్పడం‌ లేదు అని మండిపడ్డారు. మైనింగ్ మాఫియానే వీటన్నిటికీ కారణం.. రాష్ట్ర ప్రభుత్వ నాయకులను తమ గ్రిప్ లో పెట్టుకుని కేంద్రం మైనింగ్ పై దృష్టి పెట్టింది. మణిపూర్ లో కూడా మైనింగే కారణం అని గిడుగు రుద్రరాజు కామెంట్స్ చేశాడు.

Read Also: Viral Video : బాబోయ్.. ఏంటి ఈ అరాచకం.. జీవితం మీద విరక్తి కలుగుతుంది రా సామి..

కొంత మందిని దేశంలో తక్కువ చేసి చూడటం కేంద్రంలో జరుగుతోంది అని ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు అన్నారు. ప్రపంచ దేశాల్లో ఏం జరిగినా తన వల్లే జరుగుతుందన్న చంద్రబాబు ఎందుకు స్పందించ లేదు.. ఎన్డీఏ భాగస్వామి పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో మణిపూర్ అల్లర్లపై విచారణ జరగాలి అని ఆయన డిమాండ్ చేశారు. మణిపూర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి.. అక్కడ గవర్నర్ ను మార్చాలి.. ఏపీ ప్రతిపక్ష నాయకులు అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచాలి అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.

Read Also: Slum Dog Husband Review: స్లమ్ డాగ్ హజ్బెండ్ రివ్యూ

మణిపుర్ లో జరుగుతున్న అల్లర్లకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. అక్కడ జరుగుతున్న హింసపై పోరాటం చేయాలని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలుస్తారని ఏపీసీసీ చీఫ్ అన్నారు. కాంగ్రెస్ హాయంలో చేసిన అభివృద్దే ఇప్పటికి కనిపిస్తుందని గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీని గెలిపించి సత్తాచాటాలని కోరుతున్నట్లు రుద్రరాజు తెలిపాడు.