Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ghost Saves Her A Teacher From Texas Shares Interesting Ghost Story

Ghost : 16 సార్లు కత్తితో పొడిచిన బాయ్ ఫ్రెండ్.. వచ్చి కాపాడిన దెయ్యం.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Published Date :August 16, 2023 , 5:38 pm
By Sravani
Ghost : 16 సార్లు కత్తితో పొడిచిన బాయ్ ఫ్రెండ్.. వచ్చి కాపాడిన దెయ్యం.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Ghost saves a Teacher: దెయ్యాలు నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ అవి అంటే మాత్రం అందరికీ భయమే. అయితే ఇవి ఉన్నయా లేవా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఆధారాలతో ఎటువంటి సమాధానం దొరకలేదు. అయితే కొందరు దెయ్యాలని చూశామని అవి అలా చేశాయి ఇలా చేశాయి అని చెబుతూ ఉంటారు కానీ వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కొందరు అవి ఉన్నాయని నమ్ముతుంటే కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. అదంతా భ్రమ అని మానసిన నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అమెరికా కు చెందిన ఓ టీచర్‌ మాత్రం దెయ్యాన్ని చూశానని చెప్పుకొచ్చింది.

సినిమాల్లో చూపించే దెయ్యాల్లో కొన్ని చెడ్డవి ఉంటే కొన్ని మాత్రం మంచి దెయ్యాలు ఉంటాయి. కొన్ని మూవీస్ లో దెయ్యం తమ వారిని అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ టీచర్ కూడా దెయ్యం తనని కాపాడిందని చెబుతోంది. బాయ్‌ ఫ్రెండ్‌ తనని కత్తితో అతి దారుణంగా పొడిచి వెళ్లిపోతే తాను కదలలేక రక్తపు మడుగులో పడి ఉన్నానని తెలిపింది. అయితే తన పరిస్థితిని చూసి రెండు దెయ్యాలు పగలబడి నవ్వాయని అయితే అప్పుడు మరో మంచి దెయ్యం వచ్చి తనని రక్షించిందని షాకింగ్ విషయం చెప్పింది.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

వివరాల్లోకి వెళ్తే ఇలిష్‌ పో అనే 25 ఏళ్ల యువతి టెక్సాస్‌ రాష్ట్రంలో ఉంటుంది. కొలరాడోలోని ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. 2020 సంవత్సరంలో తన ప్రియుడు తనపై కత్తితో దాడికి పాల్పడ్డాడని, 16 సార్లు కత్తితో పొడిచి చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో తనకు మూడు దెయ్యాలు కనిపించాయని అందులో ఒక దెయ్యం తన అమ్మమ్మ అని తెలిపింది. 2014లోనే తన అమ్మమ్మ జీని మరణించిందని ఇలిష్ తెలిపింది. అయితే అక్కడ ఉన్న మరో దెయ్యం తన చిన్ననాటి స్నేహితుల్లో ఒకరైన విక్కీ అని, అతను 2020 ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ కథ వింటుంటే మనం సాధారణంగా అమ్మమ్మ అని చెప్పిన దెయ్యం కాపాడుతుందని అనుకుంటాం కదా. కానీ అక్కడే మరో ట్విస్ట్ చెప్పింది ఇలిష్. తాను రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు ఈ రెండు దెయ్యాలు నవ్వాయట. ఇక మూడో దెయ్యం అలీసా బర్కెట్‌ అనే అమ్మాయి. ఈమె తనకు దూరపు బంధువని, అలీసానే తనని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిందని చెప్పుకొచ్చింది.

Also Read: Point Blank Shot: చిన్నారిని భుజాలపై మోసుకెళ్తుతున్న తండ్రి… పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపిన దుండగులు

ఇటీవలే ఓ షోలో పాల్గొన్న ఆమె గతంలో తన జీవితంలో జరిగిన ‘దెయ్యం’ ఘటనను వివరించింది. తనను ఫోన్ వద్దకు తీసుకెళ్లి పోలీసులకు ఫోన్ చేసేలా చేసిందని, దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి తనని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పుకొచ్చింది. అప్పడు కూడా తనకు కొన్ని అస్పష్టమైన రూపాలు కనిపించేవని తెలిపింది. ప్రస్తుతం ఈ టీచర్ చెప్పిన దెయ్యం కథ వైరల్ అవుతుంది. ఈమె చెబుతున్నది నిజమేనా నిజమే అయితే అమ్మమ్మ కాపాడాలి కానీ దూరపు బంధువు కాపాడటం ఏంటి అని అనుకుంటున్నారు. అంతేకాకుండా నిజంగా ఈమెకు దెయ్యాలు సాయం చేశాయా లేక ఏదైనా భ్రమలో ఉండి ఇలా చెబుతుందా అని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. అయితే ఈమె చెప్పింది కూడా నిజమేనని నమ్ముతున్న వారు కూడా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ghost
  • interesting story
  • teacher
  • Texas
  • viral news

తాజావార్తలు

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

  • TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions