ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వరుస దాడులతో దూకుడు పెంచారు. తాజాగా మెహిదీపట్నంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 (మెహదీపట్నం) కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి తులసిరామ్ సునీత భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
ఘటన వివరాల్లోకి వెళితే.. ఓ బాధితుడి భవన నిర్మాణానికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన ‘స్పీకింగ్ ఆర్డర్స్’ను పట్టించుకోకుండా, నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించడంతో పాటు భవిష్యత్తులో వేధించకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీత ఏకంగా రూ. 8 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అయితే చివరకు రూ. 6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో మొదటి విడతగా రూ. 4 లక్షలను బాధితుడి నుంచి కార్యాలయంలో స్వీకరిస్తుండగా, సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో మెరుపు దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ఈ దాడుల్లో అధికారులు ఆమె వద్ద నుంచి లంచం సొమ్ముగా తీసుకున్న రూ. 4,00,000 నగదును విజయవంతంగా రికవరీ చేశారు. అలాగే సోదాల సమయంలో లెక్కల్లో చూపని మరో రూ. 2,50,000 అదనపు నగదును కూడా గుర్తించి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తన అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అనుచిత లబ్ధి పొందేందుకు యత్నించినందుకుగాను ఆమెపై ఏసీబీ అధికారులు కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేశారు.
ఫిర్యాదుదారుడి భద్రత , గోప్యతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. విచారణ ప్రక్రియను ముగించిన అనంతరం, నిందితురాలు సునీతను నాంపల్లిలోని ప్రత్యేక న్యాయమూర్తి (ఎస్పీఈ అండ్ ఏసీబీ కోర్టు) ఎదుట జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించారు. ప్రభుత్వ అధికారుల అవినీతిపై ప్రజలు ఎవరైనా నిర్భయంగా ఏసీబీని సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన ఈ మెరుపు దాడి స్థానిక అధికారుల్లో కలకలం రేపింది.
తాజావార్తలు
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!