Site icon NTV Telugu

GHMC Raids: ఈ- కామర్స్ స్టోర్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. ఈగలు, దోమలతో..

Ghmc Raids

Ghmc Raids

ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు. టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపారు. స్టోర్స్ లో ఈగలు, దోమలు తిరుగుతున్నట్లు గుర్తించారు. స్టోర్స్ లో పని చేసే వారు ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించట్లేదని అధికారులు తెలిపారు.

READ MORE: Deva Katta : రాజమౌళి సినిమాతో నాకు సంబంధం లేదు.. దేవాకట్టా క్లారిటీ

ఇదిలా ఉండగా.. ఆహార భద్రత ప్రొటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ–కామర్స్‌ సంస్థలను నియంత్రణ సంస్థ ఇటీవల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 9న ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫాంలకు చెందిన 70 మందికి పైగా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో జి.కమల వర్ధనరావు ఈ విషయాలు తెలిపారు. ఈ–కామర్స్‌ సంస్థలన్నీ వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్‌వాయిస్‌లలో తమ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు/రిజిస్ట్రేషన్‌ నంబర్లను స్పష్టంగా ముద్రించాలని ఆయన ఆదేశించారు. గిడ్డంగులు, స్టోరేజ్‌ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రొటోకాల్స్‌ పాటించాలని రావు సూచించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. అయినా ఈ సంస్థలు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు.

READ MORE: Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!

Exit mobile version