ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు
Seethakka In Assembly: తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి…
ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రముఖ గణేష్ భవన్ ఉడిపీ హోటల్‌లో ఓ కస్టమర్ ఇడ్లీ పిల్లలకు తినిపించే సమయంలో చనిపోయిన జెర్రీ కనిపించింది.