Site icon NTV Telugu

GHMC Budget 2023 : జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవ‌త్సర బ‌డ్జెట్.. వివరాలు ఇవే..

Ghmc E

Ghmc E

జీహెచ్‌ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న బల్దియా జనరల్​ బాడీ మీటింగ్​ ఎట్టకేలకు ప్రారంభమైంది. అయితే..ఈ కౌన్సిల్‌ మీటింగ్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. అయితే.. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యుల గొడవకు దిగారు. దీంతో.. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సర్ది చెప్పె ప్రయత్నం చేశారు. దీంతో.. సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అయితే.. గందరగోళం మధ్యనే 2023-24 బడ్జెట్‌ను ఆమోదించినట్లు ప్రకటించారు మేయర్‌ విజయలక్ష్మి. అయితే.. జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవ‌త్సర బ‌డ్జెట్ ముసాయిదాను బడ్జెట్‌ వివరాలు.. 2023-24 సంవ‌త్స‌రానికి  బ‌డ్జెట్ రూ. 6224 కోట్లు ప్రతిపాదించారు. అయితే..
2022-23 ఆమోదిత బ‌డ్జెట్ రూ. 6150 కోట్లు.
Also Read : GHMC Standing Council Meeting : జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో గందరగోళం

2022-23 స‌వ‌రించిన బ‌డ్జెట్ మొత్తం రూ. 6475 కోట్లు. 2023-24కు ప్ర‌తిపాదిత బ‌డ్జెట్ మొత్తం రూ. 6224 కోట్లు. 2023- 24 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత రెవెన్యూ ఆదాయం రూ. 3967 కోట్లు. 2023 -24 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత రెవెన్యూ ఖర్చు రూ. 2667 కోట్లు. 2023- 24 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ సర్ ప్లస్ రూ. 1300 కోట్లు. ప్రతిపాదిత క్యాపిటల్ రిసీప్ట్స్ రూ. 3557 కోట్లు. క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ రూ. 3557 కోట్లు. ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా రాబడి 32 శాతం (రూ. 2000 కోట్లు) పెరిగింది. పట్టణ ప్రగతి/ 15 ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్స్  ద్వారా 13 శాతం (రూ. 834 కోట్లు). టౌన్ ప్లానింగ్ ద్వారా 28 శాతం (రూ. 1750 కోట్లు). బారోవింగ్ 20 శాతం (రూ. 1218 కోట్లు). ఇతర ఆదాయం 7 శాతం (రూ. 425 కోట్లు) రాబడి అంచనా వేయడం జరిగింది.

Exit mobile version