Site icon NTV Telugu

Jayakrishna : ఘట్టమనేని జయకృష్ణ.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

Ghattamaneni Jayakrishna, Srinivasa Mangapuram Movie

Ghattamaneni Jayakrishna, Srinivasa Mangapuram Movie

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళం మూవీస్ బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతుండటం విశేషం. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్, జెమిని కిరణ్ వంటి దిగ్గజ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Toxic : ‘టాక్సిక్’ అడల్ట్ సీన్స్‌పై రచ్చ.. ‘యష్ మాట తప్పడు’ అంటూ పాత స్టేట్మెంట్ వైరల్

ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ, తన అన్న కుమారుడికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘జయకృష్ణ డెబ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక బలమైన టీమ్, ఆసక్తికరమైన ఆరంభం’ అంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జయకృష్ణ లుక్ చాలా ప్రామిసింగ్‌గా ఉండటంతో, సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఘట్టమనేని వారసుడికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

 

Exit mobile version