ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళం మూవీస్ బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతుండటం విశేషం. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ…