రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ టీజర్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో చూపించిన ఒక అడల్ట్ సీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో ఇలాంటి బోల్డ్ సీన్స్ అవసరమా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉండగా.. ఈ క్రమంలో యష్ గతంలో ఇచ్చిన ఒక పాత స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది..
Also Read : Toxic : టాక్సిక్ టీజర్.. యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరో తెలుసా?
‘నా తల్లిదండ్రులతో కలిసి చూడలేని సన్నివేశాలు ఉన్న సినిమాలను నేను అస్సలు చేయను’ అని యష్ ఒక కన్నడ టెలివిజన్ ప్రోగ్రాం లో చెప్పిన మాటలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీశారు. యష్ తన పాత మాటను మర్చిపోయారా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ‘టాక్సిక్’ టీజర్‌లో కనిపించిన ఘాటైన సీన్లకు, యష్ గతంలో చెప్పిన విలువలకు పొంతన లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని పూర్తి డార్క్ షేడ్‌లో తెరకెక్కిస్తున్నారని, కథా పరంగా ఆ సీన్లు అవసరమై ఉండొచ్చని యష్ అభిమానులు సమర్థిస్తున్నారు. ఏదేమైనా, ఈ ఒక్క సీన్ చుట్టూ జరుగుతున్న రచ్చ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా, యష్ తన తదుపరి సినిమాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అనే ఆసక్తి కూడా రేకెత్తిస్తోంది.