ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరొక వారసుడు వెండితేర అరంగ్రేటం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఇద్దిరి కుమారులలో ఒకరైన రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. మంగళవారం, RX100 వంటి సినిమాలకు డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుని రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేసారు అశ్వనీదత్. అలాగే కృష్ణతోను సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు జయకృష్ణను కూడా ఆయనే పరిచయం చేస్తున్నాడు.
Also Read : Movie PressMeet : టంగ్ స్లిప్ అవుతున్న జర్నలిస్టులు.. ప్రెస్ మీట్ లో హీరోయిన్ కు చేదు అనుభవం
ఘట్టమనేని మూడు తారలతో సినిమాలు చేసిన సందర్భంగా అశ్వనీదత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ” తెలుగు సినీ సింహాసనాన్ని ఆదిష్టించి, పద్మాలయా స్టూడియోస్ స్థాపించి, సాహసానికి మారుపేరుగా నిలిచి చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణగారితో “అగ్నిపర్వతం” నిర్మించి, ప్రేక్షకుల హృదయాలలో ‘జమదగ్ని’గా ఆయన స్థానాన్ని పదిలపరిచిన అగ్రనిర్మాత అశ్వినీదత్. నటశేఖర కృష్ణగారి వారసుడు ప్రిన్స్ మహేష్ బాబును “రాజకుమారుడు” సినిమాతో చిత్రసీమకు పరిచయం చేసి, సూపర్ స్టార్ గా ఆయన ఎదుగుదలకు పునాది వేసింది వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ గారు. మూడు తరాల నట వారసత్వానికి కొనసాగింపుగా నేడు పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ దివ్య ఆశీస్సులతో, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆత్మీయ దీవెనలతో, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ప్రేమాభిమానాలతో కృష్ణ గారి మనవడు ఘట్టమనేని “జయకృష్ణ”ను యంగ్ స్టార్ గా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూ, నవ శకానికి నాందిగా మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టిన అశ్వినీదత్ గారికి హృదయపూర్వక అభినందనలు. పద్మాలయా స్టూడియోస్, వైజయంతి మూవీస్ సంస్థల బంధం తరతరాల వెండితెర అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుతూ’ లేఖ విడుదల చేసారు.