Youtuber Arrest: మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఘట్ కేసర్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ప్రెస్ మీట్ నిర్వహించారు.
Read Also: Prasad Behara: నటి బ్యాక్ టచ్ చేసిన నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్.. రిమాండ్!
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన రాయలాపురం భానుచందర్ అనే వ్యక్తి ఘట్ కేసర్ వద్ద అవుటర్ రింగురోడ్డుపై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియో తీస్తూ కరెన్సీని అవుటర్ రింగురోడ్డుపై చెట్లపొదల్లో విసిరివేస్తూ వచ్చి తీసుకోమని మనీ హంట్ ఛాలెంజ్ చేస్తున్నాడని అన్నారని ఏసీపీ వెల్లడించారు. ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 179, నేషనల్ యాక్ట్ – 1956 ప్రకారం ప్రకారం భానుచందర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సీఐ పి.పరశురాం, ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.