క్యూట్ బ్యూటీ అంజలి హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది.హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది.2014లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న విడుదల తెలుగుతోపాటు తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శ్మశాన వాటికలో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ, దానికి అతిథులు స్పందించకపోవడం, చాలా మంది భయం వ్యక్తం చేయడంతో దాన్ని మానుకున్నారు.
అనంతరం దస్‌పల్లా వేదికగా లాంచింగ్ ప్రోగ్రామ్ ను మార్చారు. ఈ సమయంలోనే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ప్రదర్శించే థియేటర్‌లో ఆత్మల కోసం ఓ సీటు కేటాయిస్తారా అని నిర్మాత కోన వెంకట్‌కు ఓ నెటిజన్ ప్రశ్నించారు. దానికి నిర్మాత కోన వెంకట్ ఇచ్చిన రిప్లై కూడా ఆకట్టుకుంటుంది.”ఆదిపురుష్ సినిమాకు ఓ సీటు హనుమంతుడికి వదిలేసినట్లు.. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు ఓ సీటును ఆత్మల కోసం వదిలేస్తే ఎలా ఉంటుందో?” అని ఓ నెటిజన్ సరదాగా ట్వీట్ చేయగా దానికి “ఐడియా బాగుంది మూర్తి గారు.. కానీ నిజంగా వచ్చి కూర్చుంటేనే ప్రాబ్లం” అని నవ్వుతున్న ఎమోజీతో నిర్మాత, రైటర్ కోన వెంకట్ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ అనే డిఫరెంట్ థాట్ వచ్చినప్పుడు ఇలా చేయడం కూడా తప్పు కాదంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.