NTV Telugu Site icon

Israel-Gaza War: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి 22 మంది మృతి..

Gaza

Gaza

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పూర్తిగా తోసిపుచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే అనుమానంతో ఇజ్రాయెల్ సైన్యం రెండు రోజలు పాటు చుట్టముట్టించి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది.

Read Also: Liquor Sale : ఢిల్లీలో భారీగా మద్యం అమ్మకాలు.. 15 రోజుల్లో 2.58 కోట్ల సీసాలు

ఇక, గాజా నగరం మధ్యలో ఉన్న షిఫా ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న వేలాది మంది ప్రజలు రాత్రిపూట పేలుళ్ల తర్వాత పారిపోయారని, గాజా ఉత్తర యుద్ధ ప్రాంతం నుంచి పారిపోతున్నారని పాలస్తీనియన్లు తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 80,000 మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, శుక్రవారం ఆసుపత్రి నుంచి పారిపోయిన వారిలో కొందరు తీవ్రంగా గాయపడిన రోగులు, వైద్యులు వందలాది మంది మాత్రమే భవనంలో ఉన్నారని చెప్పారు.

Read Also: ICC-SLC: ఐసీసీ కీలక నిర్ణయం.. శ్రీలంక క్రికెట్‌ బోర్డు సస్పెండ్‌!

దీంతో ఇంటర్నెట్ సేవలలో అంతరాయం కారణంగా షిఫా ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించలేకపోయారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించిన పాలస్తీనా పౌరుల సంఖ్య 11,000 దాటిందని హమాస్ పాలిత గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు గాజా స్ట్రిప్‌లోని సగానికి పైగా గృహాలను ధ్వంసం చేశారు. వాటిలో 40,000 కంటే ఎక్కువ పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా ఎన్‌క్లేవ్ ప్రభుత్వం నిన్న(శుక్రవారం) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు, షెల్లింగ్‌తో గాజాలోని 50 శాతానికి పైగా హౌసింగ్ యూనిట్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.