బిగ్ బాస్ ఫెమ్ గౌతమ్ కృష్ణ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లోకి రాకముందే పలు సినిమాలు చేసి ఫెమస్ అయ్యాడు.. అయితే ఏ ఒక్క సినిమా అతనికి మంచి ఫేమ్ ను ఇవ్వలేక పోయింది.. ఆ తర్వాత లక్ ను పరీక్షించుకోవడానికి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది.. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లి చాలామంది స్టార్ స్టేటస్ ని అందుకుంటారు. ఇక అక్కడ వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకొని సినిమాల్లో రాణించాలని ఆశ పడుతుంటారు.
కాని బిగ్ బాస్ హౌస్ లోకి కోటి ఆశలతో వెళ్లిన చాలామందికి నిరాశే ఎదురవుతున్న పరిస్థితి.. ముందు బాగా ఫెమస్ అయినా వారు బిగ్ బాస్ తర్వాత ఆఫర్స్ లేక రీల్స్ చేసుకుంటున్నారు.. అదే టైమ్ లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, దీప్తి సునైన, సిరి హనుమంత్, సోహెల్, సన్నీ లాంటివారు మాత్రం తమ ఫామ్ ను కొనసాగిస్తూ.. మంచి ఆపర్లు అందుకుంటున్నారు.. ఆ లిస్ట్ లోకి చేరాడు బిగ్ బాస్ సీజన్ 7 డాక్టర్ బాబు..
గౌతమ్ కృష్ణ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో చాలా సినిమాలు చేసిన గౌతమ్ కు ఏ సినిమా హిట్ ను అందుకోలేదు. బిగ్ బాస్ కు వచ్చిన తరువాత తాజాగా ఓ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ.. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సోలో బాయ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను త్వారా నవీన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. సెవెన్ హిల్స్ బ్యానర్ పై సతీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జుడా సందే సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు.