Gautam Gambhir: సెహ్వాగ్ కాదు.. నా ఫేవరెట్ పార్టనర్ అతడే: గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Picks MS Dhoni As His Favourite Batting Partner: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విషయం ప్రస్తావించిన ప్రతిసారి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటాడు. 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌కు దక్కాల్సిన ఖ్యాతిని.. ధోనీ తన్నుకెళ్లాడని ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించాడు. అయితే తాజాగా ధోనీనే తన ఫేవరెట్ పార్టనర్ అని గంభీర్ తెలిపాడు. చాలామంది వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేవరెట్ పార్టనర్ అని అనుకుంటారని, కానీ నిజానికి ధోనీతో ఆడటం చాలా ఇష్టపడతాను అని గౌతీ చెప్పాడు.
తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్టనర్ ఎంఎస్ ధోనీ. అయితే ఫ్యాన్స్ అందరూ వీరేంద్ర సెహ్వాగ్ నా ఫేవరెట్ పార్టనర్ అని అనుకుంటారు. నేను ధోనీతో కలిసి ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉండేవి కావు. వైట్‌బాల్ క్రికెట్‌లో మహీతో కలిసి ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని. మేం ఎన్నో విలువైన భాగ్వాస్వామ్యాలను నిర్మించాం’ అని తెలిపాడు. ప్రస్తుతం గంభీర్ వ్యాఖ్యలు ధోనీ అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నాయి.
Also Read
Also Read: Harish Rao: నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో బీజేపీ అసలు రంగు బయటపడింది: హరీశ్ రావు
2011 ప్రపంచకప్ ఫైనల్‌లో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోనీలు భారీ భాగస్వామ్యం నెలకొల్పిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ఈ ఇద్దరు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫైనల్‌లో గంభీర్ 97 పరుగులు చేయగా.. ధోనీ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి కీలక భాగస్వామ్యంతో 28 సంవత్సరాల తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలిచింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!