NTV Telugu Site icon

Gas Cylinder Blast: పంజాబ్లో గ్యాస్ పేలుడు.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Panjab

Panjab

పంజాబ్ ముక్త్‌సర్‌లోని గిద్దర్‌బాహాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. డేరా సిద్ధ్ బాబా గంగా రామ్ వార్షికోత్సవ కార్యక్రమంలో సిలిండర్ పేలడంతో ఏడుగురు సేవకులకు మంటలు అంటుకున్నాయి. కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రెఫర్ చేశారు. భటిండాకు రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి 60-70 శాతం కాలిన గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు శబ్ధం విని ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు.

Uttar Pradesh: డాక్టర్ సలహాతో అరగంట పాటు ఎండలో 5 రోజుల శిశువు.. చివరకు విషాదం..

వివరాల్లోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం మాదిరిగానే బాబా జీ 93వ వర్ధంతిని మే 23న డేరా బాబా గంగారామ్ జీలో నిర్వహించనున్నారు. శ్రీ మద్భగవత్ కథ మే 16వ తేదీకి ఒక వారం ముందు శిబిరంలో ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో.. శిబిరంలోని భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తారు. శనివారం మధ్యాహ్నం అన్నదానం కోసం సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ కావడంతో సిలిండర్‌కు మంటలు అంటుకుని సిలిండర్‌ పేలిపోయింది. దీంతో.. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో శిబిరంలోని ఏడుగురు సేవకులు తీవ్రంగా కాలిపోయారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

RCB vs CSK: ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..

కాగా.. గాయపడిన వారిలో గుర్భగత్, షామ్ లాల్, గౌరవ్ కుమార్, అమృతపాల్ సింగ్, సుమిత్ కుమార్‌లు ఉన్నారు. వారిలో గుర్భగత్, షామ్ లాల్, అమృతపాల్ సింగ్‌లను చికిత్స నిమిత్సం భటిండాకు రెఫర్ చేశారు. మరోవైపు సాధురామ్‌, కలు రామ్‌ల సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రిఫర్‌ చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న SAD నాయకుడు హర్దీప్ సింగ్ డింపీ ధిల్లాన్, AAP నాయకుడు అడ్వకేట్ ప్రిత్పాల్ శర్మ, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు నరేంద్ర ముంజాల్ బింటా అరోరా క్షతగాత్రుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.