NTV Telugu Site icon

Gas Cylinder Blast: అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి బూడిదైన 6 గుడిసెలు

Gas Cylinder Blast

Gas Cylinder Blast

Gas Cylinder Blast: నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు వ్యాపించి 6 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. గుడిసెల్లోని తిండి గింజలు , దుస్తులు, సామగ్రి దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.2 లక్షల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 10 పొట్టేళ్లు సజీవదహనమయ్యాయి.

Read Also: Teacher Arrest: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ అరెస్ట్

 

Show comments